కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్ సైన్యం
- ఐసిస్ డిప్యూటీ చీఫ్ అబూ బిలాల్ మృతి
- నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్
- తన ఆదేశాలతోనే ఆపరేషన్ చేపట్టారన్న ట్రంప్
- ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ (ISIS)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ గ్లోబల్ డిప్యూటీ చీఫ్, ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ అల్-మినుకిని సైనిక దాడుల్లో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఈ అత్యంత రహస్యమైన, సంక్లిష్టమైన మిషన్‌ను అమెరికా సైన్యం, నైజీరియా సాయుధ దళాలు సంయుక్తంగా పూర్తి చేశాయని ట్రంప్ వెల్లడించారు. తన ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఐసిస్‌లో రెండో అత్యున్నత స్థానంలో ఉన్న అబూ బిలాల్ ఆఫ్రికాలో తలదాచుకుంటే ఎవరూ గుర్తించలేరని భావించాడని అన్నారు. అయితే అతడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలపై తమ నిఘాల వర్గాల ద్వారా నిరంతరం సమాచారం సేకరిస్తూనే ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. సరైన సమయం చూసి అంతమొందించినట్లు చెప్పారు.
అబూ బిలాల్ హతంతో ఐసిస్ నెట్వర్క్ పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.